ఫిలిం ఛాంబర్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా.. తనకు న్యాయం చేయాలంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత నిరసన

ఫిలిం ఛాంబర్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా.. తనకు న్యాయం చేయాలంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత నిరసన

0
94

హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద జూనియర్ ఆర్టిస్ట్ సునీత తనకు అన్యాయం జరిగిందంటూ హంగామా చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓ ప్రముఖ నిర్మాత తనను మోసం చేశాడని తీవ్ర ఆందోళన చేసింది సునీత. దీంతో ఫిలిం ఛాంబర్ వద్ద మరోసారి వాతావరణం వేడెక్కింది. రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్ వద్ద తనను తాను గొలుసులతో బంధించుకొనీ మంగళవారం రాత్రంతా నిరసన తెలిపింది సునీత. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పిన నిర్మాత నిర్మాత బన్నీ వాసు తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపణలు చేసింది సునీత. ఇదే అడిగితే తన పైన తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

తనను మోసం చేసిన నిర్మాత స్వయంగా వచ్చి సమాధానం చెబితేనే తాను బయటకు వస్తానంటూ ఆమె హంగామా చేసింది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఉదయం ఆరు గంటల సమయంలో ఫిలించాంబర్ చేరుకొని బలవంతంగా సునీత ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసుల విచారణలో సునీత మాట్లాడుతూ తనకు అన్యాయం జరిగిన విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియాలని నిరసన చేపట్టను అని చెప్పింది.

అంతేకాదు దీనిపై అల్లు అరవింద్ కూడా వచ్చి వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే తన పోరాటంతో జనసేన కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. జూనియర్ ఆర్టిస్ట్ సునీత గతంలో కత్తి మహేష్ పై కూడా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే మళ్లీ ఇప్పుడు ఓ నిర్మాత పై ఆరోపణలు చేయడం పలు అనుమానాలకు దారితీస్తుంది.