నాగార్జున కొండకు వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్. తాజాగా నాగార్జున కొండ లాంచీ ప్రయాణాలపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. నేటి నుంచి నాగార్జున కొండను చూడటానికి లాంచీ ప్రయాణాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో నేటి నుంచి సందర్శకులు నాగార్జున కొండను తిలకంచడానికి అనుమతి ఉంటుంది. అలాగే లాంచీలో ప్రయాణం చేయడానికీ అనుమతి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండున్నర సంవత్సరాల క్రితం నాగార్జున కొండ లాంచీ ప్రయాణాలను ప్రభుత్వం మూసివేసింది.
కాగ ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లాంచీ ప్రయాణాలను తిరిగి ప్రారంభించింది. రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నత అధికారుల సమక్షంలో నేటి నుంచి నాగార్జున కొండ సందర్శించడానికి లాంచీ ప్రయాణాలు ఉంటాయని తెలిపింది.
ప్రస్తుతం లాంచీ ప్రయాణాలకు అనుమతి ఇవ్వడంతో.. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు లాంచీ ప్రయాణాలు ప్రారంభం కానున్నాయి. లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ. 150, పిల్లలకు రూ. 120 టికెట్ ధర ఉంటుంది. కాగ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూర్ జిల్లాలో మాచర్ల మండలం లో గల నాగార్జున కొండను చూడటానికి లాంచీ ప్రయాణం చేస్తారు. ఇది పర్యాటకం పరంగా చాలా అభివృద్ధి చెందింది.