ఏపీ పోలీసులపై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీసులని చూస్తే జాలితో కూడిన అసహ్యమేస్తోందని ఫైర్ అయ్యారు. తమపై వైసీపీ దాడులు చేస్తున్నా, వారి అరాచకాలకి పోలీసులు కొమ్ముకాస్తూనే ఉన్నారంటూ చురకలు అంటించారు. విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ బండి పై మద్యం, బిర్యానీ పెట్టడం బరితెగింపే అంటూ నిప్పులు చెరిగారు. టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేల్చుతామని హెచ్చరించారు నారా లోకేష్.