ఇంట్లో చెడు తొలగిపోవాలంటే ఇలా చేయండి!

0
99

ఏదో ఒక సమస్య మనకు తరచూ వస్తూ ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు అయినా సరే తొలగిపోతాయి. ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఇంట్లో చెడు తొలగిపోయి మంచి మాత్రమే జరగాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటించండి. వీటిని కనుక మీరు అనుసరించారు అంటే ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. మీ ఇంట్లో పటికని పెట్టడం వల్ల సమస్యలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పటికని ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే విధంగా నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. కేవలం ఇళ్లల్లో మాత్రమే కాకుండా ఆఫీసులో కూడా మీరు ఈ చిట్కాలు పాటించచ్చు. మీరు 50 గ్రాములు పటిక ముక్కను తీసుకుని ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ ఒక మూలన పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇబ్బందులు తొలగిపోతాయి అలానే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

ఆనందం కూడా కలుగుతుంది. ప్రశాంతత కూడా కలుగుతుంది. ధనం కూడా పెరుగుతుంది. రాత్రి నిద్ర పోయేటప్పుడు పటికని నల్లటి గుడ్డలో కట్టి తలగడ కింద పెట్టుకుంటే చెడు కలలు రాకుండా ఉంటాయి. దీని వలన ఎలాంటి భయం అయినా సరే తొలగిపోతుంది. ఇలా ఈ విధంగా మీరు ఫాలో అయితే సమస్యలన్నీ కూడా పోతాయి. దీంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించచ్చు.