జగ్గారెడ్డి వివాదంపై రేవంత్ రెడ్డి రియాక్షన్

0
68

జగ్గారెడ్డి ఇష్యూ మా దృష్టికి వచ్చింది.. మా పార్టీ పెద్దలు జగ్గారెడ్డి తో మాట్లాడుతున్నారన్నారు. జగ్గారెడ్డి ఆవేదనలో అర్ధం ఉంది.  జగ్గారెడ్డి ఆవేదన, ఆలోచనను పార్టీ పరిగణలోకి తీసుకుంది. వారి ఆవేదనను తొలగించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. కొన్నిసార్లు చిల్లర వ్యక్తులు సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం మానసిక ఒత్తిడి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. మనం మానసికంగా బాధపుతున్నామని తెలిస్తే శత్రువులు ఇంకా విజృంభిస్తారు. జగ్గారెడ్డి పట్ల ఎవరు ఈ రకంగా వ్యవహరితస్తే క్షమించం. సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తాం. గతంలో విహెచ్ విషయంలో ఇలాగె జరిగింది. చివరకు పట్టుబడ్డది కౌశిక్ రెడ్డి అనుచరుడు. ఈ విధంగా కుట్రలు పన్నుతూ కాంగ్రెస్ ను బలహీనపర్చాలని చూస్తున్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగం అని రేవంత్ అన్నారు.