22 ఫిబ్రవరి 2022 రోజు ప్రత్యేకత ఏంటో తెలుసా?

0
87

ప్రతి సంవత్సరంలో కొన్ని రోజులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇలాంటి రోజులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అందుకే ఇలాంటి రోజుల కోసం చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. ఏదైన మంచి పని ప్రారంభించాలి అనుకుంటే.. ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరి ఇవాళ కూడా ప్రత్యేకమైన రోజే..ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత రోజుల్లో పంచాంగంతో పాటు న్యూరాలజికి ప్రధాన్యత పెరిగింది.  మంచి రోజులే కాదు..సంఖ్యాశాస్త్రాన్ని నమ్మేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 22 ఫిబ్ర‌వ‌రి 2022, మంగ‌ళ‌వారం చాలా ప్రత్యేకమైనది అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. సాధార‌ణంగా ఏదైనా తేదీకి, సంవ‌త్స‌రానికి లింక్ ఉంటుంది. 22 ఫిబ్ర‌వ‌రిలో సంవ‌త్స‌రం తేదీ ఉన్న‌ద‌ని అంటారు క‌దా. కానీ.. కాదు. ఆ తేదీని 22022022గా రాస్తేనే దానికి ఒక ప్ర‌త్యేక‌త వస్తుంది.

ఈ తేదీని పాలిండ్రోమ్, అంబిగ్రామ్‌గా ఉంటుంది. పాలిండ్రోమ్ అంటే.. ముందు నుంచి, వెనుక నుంచి చదివితే అదే అర్థం వ‌స్తుంది. అంబిగ్రామ్ అంటే.. పై నుంచి, కింది నుంచి చ‌దివినా అదే అర్థం వ‌స్తుంది. కాక‌పోతే.. 2 అనే అంకెను డిజిట‌ల్ క్లాక్ ఫార్మాట్‌లో రాయాల్సి ఉంటుంది. అన్నికన్నా ముఖ్యంగా తొమ్మిది నెలలు నిండిన గర్భవతులు.. ఇలాంటి అరుదైన తేదీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. ఏ తల్లిదండ్రి అయినా తమ బిడ్డ ప్రత్యేకమైన రోజున జన్మించాలని కోరుకుంటున్నారు. అలా అయితే ఆ రోజు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది. అందుకే రేపు తెలుగు రాష్ట్రాల్లో సైతం భారీగా డెలివెరీలు ఉన్నట్టు సమాచారం.. 22022022 రోజున తమ బిడ్డ పుడితే.. జీవితాంతం ఈ జీగా గుర్తు ఉంటుందని.. అంతేకాదు తమ బిడ్డ చాలా ప్రత్యేకమైన రోజున పుట్టాడని అందరికీ చెప్పుకుని తల్లిదండ్రులు ఆనందంగా ఫీలవుతూ ఉంటారు.