‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఎఫెక్ట్..సిటీలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు

0
91

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, హీరో రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్‌. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తారీఖున థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా సోమవారం జరగాల్సిన “భీమ్లా నాయక్‌” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు అయింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి నేపథ్యంలో.. “బీమ్లా నాయక్‌” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి ఇవాళ భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. హైదరాబాద్‌ యూసఫ్‌ గూడలోని పోలీస్‌ గ్రౌండ్స్‌ లో ఈ ఈవెంట్‌ జరుగుతోంది. అయితే.. ఈ ప్రీ రీలీజ్‌ ఈవెంట్‌ జరుగుతున్ననేపథ్యంలో.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇవే…

మైత్రివ‌నం నుంచి వ‌చ్చే ట్రాఫిక్ యూసూఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు అనుమ‌తించ‌రు. స‌వేరా ఫంక్ష‌న్ హాల్ వ‌ద్ద కృష్ణ‌కాంత్ పార్కు-క‌ల్యాణ్ న‌గ‌ర్‌, స‌త్యసాయి నిగ‌మాగ‌మం, క‌మ‌లాపురి కాల‌నీ, కృష్ణాన‌గ‌ర్, జూబ్లీహిల్స్ వైపు మ‌ళ్లించ‌బడుతుంది.

జూబ్లీహిల్స్ నుంచి వ‌చ్చే ట్రాఫిక్ యూసూఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు అనుమ‌తించ‌బ‌డ‌దు. శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీ, సత్యసాయి నిగమాగమం వైపు మళ్లించబడుతుంది.

భీమ్లానాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వానితులు త‌మ వాహ‌నాల‌ను ఈ కింది పార్కింగ్ ప్ర‌దేశాల్లో మాత్ర‌మే పార్కు చేయాల‌ని ట్రాఫిక్ పోలీసులు అభ్య‌ర్థించారు.

1. సవేరా ఫంక్షన్ హాల్
2. మహమూద్ ఫంక్షన్ ప్యాలెస్
3. యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ పార్కింగ్
4. సవేరా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓపెన్ గ్రౌండ్
5. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం
6. ప్రభుత్వ పాఠశాల, యూసుఫ్‌గూడ

ఈవెంట్‌కు హాజ‌ర‌య్యే వ్య‌క్తులంద‌రూ త‌ప్ప‌కుండా నిర్వాహ‌కులు జారీ చేసిన 23-02-2022 కొత్త పాస్‌ల‌ను క‌లిగి ఉండాల‌ని.. అలాంటి పాసుల్లో హోలోగ్రామ్‌, సీరియ‌ల్ నెంబ‌ర్ ఉండాలి. దీనితో  నిర్వాహ‌కులు 21న జారీ చేసిన పాస్‌లు అస్సలు చెల్లవు అన్న మాట.