పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరో రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నిత్యామీనన్ రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తుంది. భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తారీఖున థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
తాజాగా బీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే ఈ సినిమాలో పాట పాడిన మొగులయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై మాట్లాడారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నేను పాట పాడకుంటే ఎవరికీ తెలిసి ఉండేవాడిని కాదు. ఇంత పేరు వచ్చేది కాదు అని మొగులయ్య పేర్కొన్నారు. ఈ సినిమాలో పాట పాడిన తరువాత నాకు పవన్ కల్యాణ్ సన్మానం చేసి, లక్ష రూపాయలు నగదు కూడా ఇచ్చారని..అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇల్లు ఇచ్చి, సన్మానం చేసి రూ.కోటి సాయం అందించారని పేర్కొన్నారు.
భీమ్లానాయక్ పాట పాడిన తరువాత నాకు గొప్ప పేరు వచ్చింది. ఈ పేరు రావడానికి పవన్ కల్యాణ్ కారణమన్నారు. ఇందులో పాట పాటడం నా అదృష్టం. ఈ సినిమాలో పాట పాడిన తరువాత ఢిల్లీలో నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా నాతో అందరూ సెల్పీలు దిగుతున్నారు. నన్ను గొప్పగా తయారు చేయడానికి ఈ సినిమాలోని పాటనే కారణమన్నారు. మొగులయ్య మాట్లాడిన తరువాత స్టేజీ పై మరొకసారి ఆడకాదు.. ఈడకాదు సాంగ్ పాడారు.