రష్యా , ఉక్రెయిన్ ల యుద్ధం – బీర్ బాబులకు షాక్ ?

0
78

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడి జరుగుతుంటే అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు ఊరుకుంటాయా? ఉక్రెయిన్ కు సాయం చేయవా..?  మన దేశం ఏం చేస్తుంది? ఉక్రెయిన్ పై యుద్ధం ప్రభావం ప్రపంచంపై, మన దేశంపై ఏ విధంగా ఉంటుందో చూడాలి. భారత్ లో పెట్రోల్, వంట నూనెల ధరలు పెరుగుతాయా? వాణిజ్య రంగంపై దాని ప్రభావం ఎంత వరకు ఉంటుంది. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఏ మేరకు ఉండొచ్చనే చర్చ సాగుతోంది. ఇప్పుడు ఈ అంశంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు ఆసక్తికర విషయాలు తెలిపారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ యుద్ధం రష్యాపైన ఆంక్షలకు కారణం అవుతుంది. అమెరికా ఆంక్షలు మొదలయితే మన దేశానికి నష్టం ఎందుకంటే..రష్యా మనకు డిఫెన్స్ పార్ట్ నర్. అమెరికాలో ఒక చట్టం ఉంది. కౌంటిరింగ్ అమెరికన్ ఎడ్వర్సరీ శాంక్షన్ చట్టం వుంది. ఈ చట్టం కింద అమెరికా ఆంక్షలు పెట్టవచ్చు. ఇదొక ఛాలెంజ్ గా ఇండియాకు ఉండవచ్చు. త్వరలో ఆయిల్ ధరలు పెరుగుతాయి. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ముడిచమురు ఉత్పత్తిలో 13 శాతం రష్యా ఉత్పత్తి చేస్తుందని అంచనా. అలాగే యూరప్ వాడుతున్నటువంటి గోధుమల్లో 40 శాతం రష్యా నుండే వస్తున్నాయి. గ్యాస్ అవసరాల్లో కూడా 40 శాతం రష్యా నుండే రావాలి. ఇది తప్పకుండ ఆర్ధిక ప్రభావం ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే..బీర్ తాగే వాళ్ల పైన కూడా ఈ ఉక్రెయిన్ సంక్షోభ ప్రభావం ఉండనుంది.

మందుబాబులకు కూడా ఈ సంక్షోభంతో సమస్య రానుంది. అయితే మార్చి నుండి జూన్ వరకు బీర్ సీజన్ గా చెప్పుకోవొచ్చు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరుగుదలతో బీర్ల అమ్మకాలు జోరందుకుంటాయి. అయితే 2020 లో కరోనా మహమ్మారి కారణంగా మార్చి నుండి జూన్ వరకు లాక్ డౌన్ ఉన్న విషయం తెలిసిందే. 2021 మార్చిలో ఈ పరిస్థితి బాగుంటుంది అనుకున్న టైంలో సెకండ్ వేవ్ వచ్చింది. దీనితో బీర్ల అమ్మకానికి సీజన్ గా భావించే ఈ నెలల్లో గత రెండు సంవత్సరాలుగా అమ్మకాలు లేవు. ఈసారి అమ్మకాల్లో బీర్లు 40 శాతం వృద్ధి రేటు ఉండనుంది. అంటే ఈ లేదా 5 నెలల్లో 40 నుండి 45 శాతం అమ్మకాలు జరుగుతాయి. అయితే బీర్ల తయారీలో ప్రముఖమైనది బార్లీ. అయితే బార్లీని ఉత్పత్తి చేసే 5 దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. అందువల్ల ఈ యుద్ధం వల్ల బార్లీ సరఫరాలో అంతరాయం కలగనుంది. దీనితో బార్లీ ధరలు భారీగా పెరగనున్నాయి. ధరలు పెరిగిన కూడా బీర్ బాబులు దానికి అధిగమించి తాగుతారో చూడాలి.