నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా తెరకెక్కుతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా నిర్మాతలు ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఫస్ట్‌లుక్‌ను క్రికెట్ మ్యాచ్‌ల ప్రచారానికి కూడా వాడేస్తున్నారు..
ఈ లుక్ ను చూసి మాస్ క బాప్ అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. ఎన్‌బీకే 107 సినిమాలోని బాలయ్య మాస్ లుక్ లో రోహిత్ ఫోటోను జోడించి ఉంది. హిట్ కొట్టాలంటే బాలయ్య.. 6 కొట్టాలంటే హిట్‌మ్యాన్ అనే క్యాప్షన్ కూడా రాసుకువచ్చింది. కాగ ఎన్‌బీకే107 ను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఈ ఫోటోను ట్వీట్టర్ లో షేర్ చేసింది. ఎన్‌బీకే107 అంటూ క్యాప్షన్ కూడా రాసుకువచ్చింది. కాగ బాలయ్య మాస్ లుక్ లో ఉన్న రోహిత్ శర్మ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.