Breaking: మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్

Ukrainian president calls Modi

0
81

ఉక్రెయిన్ పై ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ర‌ష్యాకు చెందిన ల‌క్షల మంది సైనికులు.. ఉక్రెయిన్ న‌గ‌రాల్లో బాంబుల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే ఉక్రెయిన్ సైన్యం ధీటుగా బదులిస్తుంది. ఒంటరి పోరాటం చేస్తున్న ఉక్రెయిన్.. ప్ర‌పంచ దేశాల సాయం కోసం ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫోన్ చేశారు. ర‌ష్యా చేస్తున్న దురాక్ర‌మ‌ణ‌ను ఆపించాల‌ని కోరారు. అలాగే ఐక్య రాజ్య స‌మ‌తి భ‌ద్ర‌తా మండ‌లిలో త‌మ దేశానికి మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరారు. ఉక్రెయిన్ దేశంలో యుద్ధ ప‌రిస్థితుల గురించి జెలెన్ స్కీ ఫోన్ లో ప్ర‌ధాని మోడీకి వివ‌రించారు.