కేసీఆర్ వి తాగుబోతు మాటలు..టీపీసీసీ చీఫ్ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

0
127

టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ సర్కార్ పై మాదిపడుతూనే ఉన్నారు. అలాగే ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కు లేఖ రాసి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాజాగా మరోసారి సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

8 ఏళ్ళుగా పాలిస్తున్న కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తున్నామని చెప్పి కబంధ హస్తలలో బంధించారని విమర్శించారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో కొండా రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, మనిక్ రావ్, దేవేందర్ గౌడ్ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేశారు. పరిగి ఎమ్మెల్యే దేవుడు మాన్యాలను మింగిండు. చేవెళ్లను కొండ పోచమ్మలో ముంచిండు, చెల్లమ్మ ను టిఆర్ఎస్ లో కలుపుకున్నాడు. అభివృద్ధి కోసం టిఆర్ఎస్ లో కలిసామని అన్న చేవెళ్ల చెల్లమ్మ ఎందుకు చేవెళ్ల అభివృద్ధి కోసం అడగడం లేదు.

ఈ ప్రాంతానికి రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల తెచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి జిఓ ఇచ్చారు. ప్రాణహిత ప్రాజెక్టును చేవెళ్లను రాకుండా అడ్డుకున్నది కేసీఆర్ కాదా..యాదగిరి గుట్టలో కేసీఆర్ ప్రమాణం చేసి చెబుతావా కేసీఆర్..గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లను ఏ దేవుడు పాలిస్తున్నారు.. ఈ ప్రాంతాన్ని ఏ దయ్యం పాలిస్తుంది. పాలమూరు రంగారెడ్డిని కట్టమని కేసీఆర్ కోర్టులో ఆఫడవిట్ ఇచ్చారు.

కేసీఆర్ జగన్ ప్రగతి భవన్ లో అలయ్ బలాయ్ చేసుకొని మనల్ని నిండా ముంచిండ్రు..మూడేళ్ళ కిందనే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే ఇవాళ ఇలా మా గొంతులు ఎండేవా ఆంధ్ర వాళ్ళు నీళ్లు, నిధులు దోచుకుబోతున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు నీళ్లు వస్తాయి అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చాక ఇప్పుడు నీళ్లు జగన్ దోచుకుపోయాడు.. నిధులు మేఘ కృష్ణ రెడ్డి దోచుకుపోయాడు.. నియామకాలు కేసీఆర్ ఇంట్లో అయ్యాయి.

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు దేశానికి ప్రధాని చేయమంటున్నాడు.. ఇక దేవుణ్ణి చేస్తే అన్ని పనులు చేస్తారనే పరిస్థితి ఉంది.. కేసీఆర్ తాగుబోతు మాటలు నమ్మే పరిస్థితి లేదు.. రాష్ట్రంలో ఆర్టీసీ, విద్యుత్, మహిళలు, టీచర్లు, కలెక్టర్ల అవినీతి, నిరుద్యోగులు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరు వాళ్ల గురించి మాట్లాడుతున్నారు.. రైతుల ధాన్యం కొనమని అంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వేసిన వరి కొనేవాడు మన రైతుల వడ్లు కొనాలి… కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎవరు కొంటె వాళ్లే కొనాలి. కేసీఆర్ వడ్లు కొనకపోతే కేసీఆర్ ను అమరవీరుల స్పూపం వద్ద ఉరి వేద్దాం అని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.