అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు… ఏకంగా జగన్ ఆయనకు డబుల్ ప్రమోషన్ ఇచ్చారు.. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తీర్థం తీసుకుని లక్కీగా ఎమ్మెల్యే అయ్యారు…
ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కుతుందని భావించి భంగిపడ్డారు… కానీ జగన్ కేబినెట్ లో ఆయనకు మంత్రి పదవి వరించలేదు…
దీంతో ఆయనకు అధిష్టానం డబుల్ ప్రమోషన్ ఇచ్చినట్లు రెండు కీలక పదవులను కట్టబెట్టారు…ఏపీ బ్రాహ్మన కార్పోరేషన్ తో పాటు టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడుగా నియమించింది. దీంతో అయనకు డబుల్ ప్రమోషన్ దక్కినట్లు అయిందని అభిమానులు అంటున్నారు..