ఇంట్లో సాలి పురుగులు ఉంటే చాలా ప్రమాదం..వెంటనే ఇలా చేయండి?

0
178

సాధారణంగా అందరి ఇళ్లల్లో సాలీడు గూళ్లు కడుతుంటాయి. స్టోర్ రూమ్స్ లో, ఇంటి మూలల్లో అక్కడక్కడ సాలీడు గూళ్లు ఉంటాయి. మనం అవి ఉన్న పెద్దగా పట్టించుకోము. మనం అ‌వి ఉన్నప్పటికీ..చేత్తోనే పక్కను అనేసి స్టోర్ రూమ్స్ లాంటి ప్రదేశాల్లో అయితే మనకు ఏదైనా పని ఉంటే చూసుకొని వెళ్తాము. వాటిని పెద్దగా ప్రమాదకరంగా కూడా మనం పట్టించుకోం. అధికంగా ఉంటే మాత్రమే క్లీన్ చేస్తారు. అసలు ఇవి ఇంట్లో ఉండటం మంచిది కాదట. కానీవీటివల్ల ఎంత డేంజరో తెలుసా? సాలెపురుగులు మీ ఇంట్లో ఉంటే ఈ పద్దతులను పాటించి వెంటనే వాటిని తరిమేయండి. లేదంటే మన ఆరోగ్యాన్ని మనమే ఇబ్బందుల్లోకి నెట్టిసినట్టే.

పుదీనా నూనె స్ప్రే:

మీరు ఇంటి మూలల్లో పుదీనా నూనె స్ప్రే చేస్తే సాలీడులు పారిపోతాయి. ఎందుకంటే సాలీడు దీని వాసనను అసలు తట్టుకోలేదు. ఇంటి మూలల్లో పుదీనా ఆయిల్ స్ప్రే చేయడం వల్ల సాలీడులు పారిపోవడం కాయం అంటున్నారు నిపుణులు.

వారానికోసారి ఇళ్లు శుభ్రం:

కేవలం పండుగకు కాకుండా వారానికి ఒకసారి ఇళ్లు క్లీన్ చేస్తూ ఉండటం అలవాటుగా పెట్టుకోండి. అలా చేయకుంటే.. సాలీడులు ఇష్టమొచ్చిన దగ్గర దాని సంతతిని అభివృద్ధి చేస్తాయి. కానీ మీరు ప్రతి వారం ఇంటిని శుభ్రం చేస్తే సాలెపురుగులు మీ ఇంటి దరి చేరవు.

నీటిని పిచికారీ:

మీ ఇంటి వెలుపల స్పైడర్ వెబ్‌లు కనిపిస్తే వెంటనే పైప్‌ ద్వారా నీటితో వాటిని తొలగించాలి. మరొసారి అవి అక్కడికి రాకుండా ఉంటాయి. సాలిపురుగులు ఇంటి మూలాల్లో ఉంటే..ఇంటి లుక్ నే మార్చేస్తాయి. చూడ్డానికి అస్సలు  బాగుండదు.

ఇంటి బయట శుభ్రం:

సాలెపురుగులు ఇంట్లో గూళ్లు కట్టుకుంటాయి కానీ అవి మీ ఇంటి బయట కూడా పెద్ద గ్యాంగ్ నే మెయింటేన్ చేస్తాయని  మనందరం తెలుసుకోవాలి. సాలెపురుగులు సాధారణంగా ఇంటి మూలలు, బాల్కనీలను ఎంచుకొని గూళ్లు కట్టుకుంటాయి. ఎందుకంటే ఇవి కీటకాలను పట్టుకోవడానికి మంచి ప్రదేశాలు కనుక. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.సాలె పురుగుల నుంచి మీ ఇంటిని కాపాడుకోవాలంటే అవి ఎక్కడకనిపిస్తే అక్కడ చీపురుతో శుభ్రం చేయాలి. దీంతో మీ ఇల్లు అన్ని సమయాలలో చక్కగా కనిపిస్తుంది.

ఇలాంటి చిన్న చిట్కాలతో సాలి పురుగులు మీ ఇంట్లో లేకుండా చేసుకోవచ్చు.