అంబేద్క‌ర్ ఓపెన్ వ‌ర్సిటీ డిగ్రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌..పూర్తి వివరాలివే..

Ambedkar Open University Degree Examination Schedule Released..Full Details ..

0
79

Braou: డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ వ‌ర్సిటీలో డిగ్రీ చేసే విద్యార్థులకు అలెర్ట్. ఇప్పటికే సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండగా తాజాగా డిగ్రీ ఫ‌స్ట్, థ‌ర్డ్, ఫిప్త్ సెమిస్ట‌ర్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెల‌లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 17 నుంచి 23 వరకు, మూడో సంవత్సరం ఐదో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి 30 వరకు, అలాగే మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి 13 వరకు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.braouonline.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.