ఏపీలో కొత్త జిల్లాల అంశంపై రగడ ఇంకా కొనసాగుతుంది. తాజాగా ఈ అంశంపై వైసీపీ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలని బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతో తానే కొట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నర్సాపురం ఎమ్మెల్యేగా ముదునూరి ప్రసాదరాజును గెలిపించి తప్పు చేశానని, ఆవేదన వ్యక్తం చేశారు.