Breaking: ఉక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి

0
74

ఉక్రెయిన్ దేశంలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే భారతీయ విదేశాంగ శాఖ ధృవీకరించింది. పంజాబ్ బర్నాలా కు చెందిన చందన్ జిందాల్ (22) ఇ స్కీమిక్ స్ట్రోక్‌ తో విన్నిట్సియా అత్యవసర ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్యం విషమించడంతో మృతి చెందాడు. చందన్ జిందాల్ విన్నిట్సియా ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. కాగా ఇప్పటికే ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడిలో నిన్న ఓ భారతీయ విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే.