FAKE: కరోనా ఫండ్ కింద ఒక్కొక్కరికి రూ.5 వేలు..ఇందులో నిజమెంత?

0
101

ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలు ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనవసరంగా మనం మోసపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి కూడా ఫేక్ వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. స్కీముల మొదలు జాబ్స్ వరకు చాలా నకిలీ వార్తలు మనం ఈ రోజుల్లో వింటున్నాము.

అయితే తాజాగా మరో ఒక వార్త వచ్చింది. మరి అందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..కేంద్ర ప్రభుత్వం కరోనా ఫండ్ నుంచి రూ.5 వేలు అందిస్తోందనే మెసేజ్ మీకు ఏమైనా వచ్చిందా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మెసేజ్‌లను నమ్మవద్దు. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. 

నిజంగా యూనియన్ హెల్త్ మినిస్టరీ రూ. 5000 ఇస్తోందా లేదా అనేది చూస్తే… ఇది కేవలం ఫేక్ వార్త అని.. యూనియన్ మినిస్టరీ ఎటువంటి డబ్బులు కరోనా ఫండ్ రిలీఫ్ కింద ఇవ్వడం లేదని తెలుస్తోంది. కానీ చాలా మంది ఇది నిజం అనుకుని దీన్ని షేర్ చేస్తున్నారు.

ఇది ఫేక్ వార్త కాబట్టి ఎవరికి షేర్ చేయొద్దు. వాళ్ళని మీరు కూడా అనవసరంగా నమ్మి మోసపోవద్దు. ఇటువంటి ఫేక్ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనవసరంగా మోసపోతారు. కనుక నకిలీ వార్తలుకి దూరంగా ఉండండి అనవసరంగా నమ్మి చిక్కుల్లో పడకండి.

ఫేక్ వార్తలను నమ్మకండి..వాటిని షేర్ చేయకండి.