UIDAI సంచలన నిర్ణయం..అడ్రస్ ఫ్రూప్‌ లేకుండానే వారికి ఆధార్‌ కార్డ్‌!

0
97

యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI తీపికబురు అందించింది. అడ్రస్ ప్రూఫ్ లేకుండా సెక్స్ వర్కర్లకు కూడా ఆధార్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని వెల్లడించింది. వీళ్లు ఇకపై ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ కార్డు పొందొచ్చు. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగనుంది. సుప్రీం కోర్టుకు ఈ కీలక విషయాన్ని UIDAI తెలియజేసింది.

అయితే అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఆధార్ కార్డు పొందాలంటే మాత్రం ఒక షరతు ఉంది. సెక్స్ వర్కర్లు కచ్చితంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (ఎన్ఏసీవో) జారీ చేసే సర్టిఫికెట్ కచ్చితంగా కలిగి ఉండాలి. ఎన్ఏసీవో జారీ చేసే సర్టిఫికెట్ లేకపోతే స్టేట్ హెల్త్ డిపార్ట్‌మెంట్ జారీ చేసే సర్టిఫికెట్ కలిగి ఉన్నా సరిపోతుంది. ఆధార్ కోసం అప్లై చేసుకోవచ్చు.

మామూలుగా UIDAI దరఖాస్తుదారుని పేరు, లింగం, వయస్సు, చిరునామా వంటి తప్పనిసరి వివరాలను తీసుకుని ఇమెయిల్, మొబైల్ నంబర్‌ను కలిగి ఉండే ఐచ్ఛిక డేటాను సేకరించిన తర్వాత ఆధార్ కార్డ్‌లను జారీ చేస్తుంది. సెక్స్ వర్కర్ల విషయంలో మాత్రం రెసిడెన్షియల్ ప్రూఫ్‌ లేకుండా ఆధార్ కార్డులను జారీ చేస్తామని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తెలిపింది.