మీ పిల్లలు టీవీ ఎక్కువగా చూస్తున్నారా.. అయితే తప్పక ఈ జాగ్రత్తలు తీసుకోండి!

0
125

 

పిల్లలు ఎక్కువ సమయం టీవీ చూడడం ఆరోగ్యానికి ఎంతో హానికరమని మనందరికీ తెలిసిన విషయమే. కానీ పిల్లలను టీవీలను దూరంగా ఉంచాలని ఎంతగా ట్రై చేసిన వీలు కావడం లేదని.. ప్రస్తుత రోజుల్లో వారిని టీవీ, ఫోన్ వంటి వస్తువులకు దూరంగా ఉంచడం చాలా కష్టంతో కూడుకున్న పని అంటూ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. అయితే వాళ్ళను టీవీ చూడడం మాన్పించకపోయిన వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్లను మనంకాపాడినట్టే. మరి ఆలస్యం చేయకుండా అవేంటో చూసేద్దాం.

మీ పిల్లలు గంటలు గంటలు టీవీ ముందు కూర్చుంటే.. వారి కళ్లతోపాటు.. మెదడుపై కూడా ప్రభావం చూపిస్తుంది. అందుకే దాదాపు ఒక గంట టీవీ చూస్తే ఆ తర్వాత వారు వేరే పనిలో నిమగ్నమయ్యేలా చేయండి. గంట తర్వాత టీవీ నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. అలాగే.. పిల్లలు టీవీ స్క్రీన్‏కు చాలా దగ్గరగా కూర్చుని టీవీ చూడడం వల్ల  కళ్లపై ప్రభావం చూపుతుంది. దీంతో డ్రై ఐ సమస్య కూడా కనిపిస్తుంది. అందుకే టీవీ చూస్తున్నప్పుడు మీ పిల్లలు స్క్రీన్‏కు దూరంగా ఉండేలా చేయండి.

ఇవే కాకుండా పిల్లలు చాలాసార్లు బెడ్ పై పడుకుని కుడా టీవీ చూస్తుంటారు. దీంతో వెన్నునొప్పి, మెడ, భుజం నొప్పి సమస్యలు వస్తాయి. అందుకే వారు నేరుగా కుర్చీపై కూర్చోని టీవీ చూసేలా చేయండి. అలాగే.. వారు కూర్చున్నప్పుడు వెనకాల ఒక దిండు లేదా టవల్ పెట్టండి.. దీనివలన టీవీ చూస్తూ ఎక్కువసేపు కూర్చోవడం వలన వెన్నునొప్పి సమస్య రాకుండా ఉంటుంది. అలాగే ప్రతి గంట గంటకు టీవీ ఆఫ్ చేయాలి.

గంట తర్వాత పిల్లలను టీవీ చూడకుండా చేయాలి. టీవీ చూసేటప్పుడు సమయం చాలా ముఖ్యం. ఎక్కువ సమయం పిల్లలు స్క్రీన్ ముందు ఉండడం వలన కంటి సమస్యలు వస్తాయి. టీవీ చూసిన తర్వాత మీ పిల్లలకు శారీరక శ్రమ కల్పించండి.. గేమ్స్ ఆడడం.. రన్నింగ్, వాకింగ్ చేయడం నేర్పించాలి. అలాగే టీవీ చూస్తున్నప్పుడు పిల్లలు ఉన్న గదిలోని లైట్స్ ఆఫ్ చేయకూడదు. ఇలా చేయడం వలన కేవలం టీవీ స్క్రీన్ పిల్లల కంటిపై నేరుగా పడుతుంది. అలగే ఆహారం తింటూ పిల్లలు టీవీ అస్సలు చూడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి. ఈ జాగ్రత్తలు వెంటనే పిల్లలు పాటించేలా చేయండి.