తెలంగాణకు కేంద్రం శుభవార్త..మూడు కొత్త రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం

Center good news for Telangana..Three new railway projects

0
81

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు కొత్త రైల్వే ప్రాజెక్టులు యువజనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కీలక ప్రకటన చేశారు మంత్రి అశ్విని వైష్ణవి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉపాధితో పాటు ప్రజల కష్టాలు కూడా తగ్గుతాయని వివరించారు.

హైదరాబాద్ నుంచి దేశంలో ప్రధాన నగరాలకు రాజధాని, దూరంతో రైళ్ల మంజూరు విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అలాగే రైలు చార్జీలు పెంచే యోచన తమకు లేదని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి దేశంలో ప్రధాన నగరాలకు రాజధాని, దూరంతో రైళ్ల మంజూరు విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరడం, అదే సంవత్సరం జూన్‌ 2న తెలంగాణ ఏర్పడటం జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఎనిమిదేండ్లుగా ఒక్క కొత్త రైల్వే లైను కూడా రాష్ట్రానికి మంజూరు కాలేదు.

ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా కొత్తలైన్లు ఏ రాష్ట్రానికి మంజూరు చేయలేదంటూ కేంద్రం చేతులు దులుపుకుంటుంది. తెలంగాణలో 33 జిల్లాలున్నాయి. వీటిలో 14 జిల్లాలకు మాత్రమే రైల్వేలైన్‌ సౌకర్యం ఉన్నది. కొత్త జిల్లాలకు అనుసంధానత కల్పించాల్సిన బాధ్యత రైల్వే శాఖకు ఉన్నది. తెలంగాణ ఆవిర్భావం నుంచి 11 కొత్త రైల్వే లైన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ రైల్వే మంత్రికి లేఖ కూడా రాశారు.