తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫైర్ అయ్యారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మమతా రాజకీయ ప్రసంగాలు చేయడం ఏంటి. ఒక పార్టీ దిష్టి బొమ్మను ఎలా తగులబెడుతుంది..
మమత లాంటి వారిని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎంత మంది ఉద్యమకారులకు టిఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల పై ఎందుకు స్పందించడం లేదు. చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నా షీ టీమ్స్ ఏం చేస్తున్నాయని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలలకు రక్షణ లేదు. భద్రత లేదు. మహిళలకు ఏం చేసారని సంబరాలు. మహిళా బందు సంబరాల గురించి మాట్లాడిన టిఆర్ఎస్ నేతలు ఒక్కరైనా ఉద్యమంలో ఉన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.