ఇంటర్మీడియట్‌ అర్హతతో ఉద్యోగాలు..దరఖాస్తు చేసుకోండిలా..

0
90

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విభాగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.  సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలోనున్న మిలిటరీ కాలేజీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (MCEME) తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ పోస్టులను అబ్సార్‌ప్షన్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

పోస్టుల వివరాలు: ల్యాబొరేటరీ అటెండెంట్, జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, సీనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్‌, లైబ్రరీ అటెండెంట్‌ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.14,950ల నుంచి రూ.18,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీసీఏ, బీఎస్సీ, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం:

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం:

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: MCEME, Trimulgherry (P.O), Secunderabad, Telangana.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 21, 2022.