వారికి సీఎం కేసీఆర్ శుభవార్త..అధికారిక ఉత్తర్వులు జారీ

0
75

వెనుకబడిన కులాలు(బీసీలు), దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త అందించింది. ఉద్యోగ నియామకాల్లో బీసీలకు వయో పరిమితిలో 10 ఏళ్లు సడలింపును ఖరారు చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌. ఈ ప్రయోజనాలు మే 31, 2031 వరకు అమలు కానున్నాయి.

అలాగే దివ్యాంగులకు ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల కాలపరిమితి, వయోపరిమితి గడువు పెంపునకు అనుగుణంగా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్సాహపరుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా మంది బీసీలకు మేలు చేకూరనుంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో నేడు కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బడ్జెట్ ఆమోదం కోసమే కేబినెట్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 2022-23కు సంబంధించి బడ్జెట్ ను ఆమోదం తెలుపనుంది కేబినెట్. రేపు ఉభయ సభల్లో రెండింటిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.