పెళ్లి పీటలెక్కనున్న మరో టాలీవుడ్ నటుడు..ఫోటోలు వైరల్

0
96
Karthik Rathnam

మరో టాలీవుడ్ నటుడు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. నారప్పలొ పెద్ద కొడుకుగా నటించిన కార్తీక్‌ రత్నం హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ మేరకు వీరి నిశ్చితార్థం నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో వేడుకగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ఆరంభించిన కార్తీక్‌.. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ కార్తీక్‌కు అనుకున్నంత గుర్తింపు లభించలేదు. అనంతరం హీరోగా చేసిన ‘అర్ధ శతాబ్దం’ మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇటీవల విడుదలైన ‘నారప్ప’లో వెంకటేశ్‌ పెద్దకుమారుడి పాత్రలో కార్తీక్‌ నటించి మెప్పించారు.