రాష్ట్ర కేబినెట్ తెలంగాణ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఈరోజు సీఎం అధ్యక్షతన ప్రగతి భవన్ లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అయింది. వివిధ శాఖలకు చెందని మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రేపటి నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో 2022-23 బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. రేపు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా 2022-23 తెలంగాణ ప్రవేశపెట్టే బడ్జెట్ పై భారీ అంచానాలు నెలకొన్నాయి.