మనిషి అందానికి వన్నె తెచ్చే వాటిలో కళ్ళు ముందుంటాయి. కానీ ఆ కంటి కింద నల్లటి వలయాలు మనకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. ఇటీవల కాలంలో ఈ సమస్య అధికం అవుతుంది. మనిషికి నల్లటి వలయాలు అందవికారంగా కన్పిస్తుంటాయి. అయితే ఈ వలయాలు మానసిక ఒత్తిడి వల్ల కానీ, నిద్ర లేకపోవడం వల్ల కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుత రోజుల్లో మారిన జీవన శైలి కారణంగా చాలావరుకు అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నారు. తగినంత నిద్ర, ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం వలన కంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. కరోనా మన జీవితాల్లోకి అడుగుపెట్టాక నిత్యం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందే గడపడం వల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువవుతున్నాయి.
వీటిని పోగొట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల క్రిములను వాడుతుంటారు. అయితే వీటికి బదులు సహజ పద్ధతులను ఉపయోగించడం మేలంటున్నారు చర్మసౌందర్య నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం..
అలోవెరా జెల్..
అలోవెరాలో చర్మ సంరక్షణకు సంబంధించిన పోషకాలు చాలా ఉంటాయి. కళ్ల కింద నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి అలోవెరా జెల్ తీసుకుని దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి. ఇప్పుడు ఈ మాస్క్‌ని కళ్ల కింద అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత కడిగేయాలి. కొద్దిరోజుల్లోనే కళ్ల కింద వలయాలు తగ్గిపోతాయి.
కీర..
తీవ్రమైన అలసట కూడా కళ్ల కింద నల్లటి వలయాలకు ఒక కారణం. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ ప్రాంతాన్ని తాజాగా ఉంచడానికి కీర సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం దోసకాయ తురుము రసం తీసి కళ్ల కింద అప్లై చేయాలి. కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేయడం వల్ల నల్లటి వలయాలు మాయమవుతాయి.
బంగాళదుంప..
చర్మ సంబంధిత రుగ్మతలను తొలగించే గుణాలు బంగాళాదుంపలో పుష్కలంగా ఉంటాయి. ఇందుకోసం బంగాళాదుంప రసాన్ని తీసి కాటన్ సహాయంతో కళ్ల కింద భాగంలో రాయండి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద వలయాలు మాయమవుతాయి. ఇక బంగాళాదుంప రసాన్ని ముఖంపై రాసుకుంటే చర్మంపై ఉన్న ట్యానింగ్ తొలగిపోతుంది.
కీర..
తీవ్రమైన అలసట కూడా కళ్ల కింద నల్లటి వలయాలకు ఒక కారణం. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ ప్రాంతాన్ని తాజాగా ఉంచడానికి కీర సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం దోసకాయ తురుము రసం తీసి కళ్ల కింద అప్లై చేయాలి. కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేయడం వల్ల నల్లటి వలయాలు మాయమవుతాయి.
కాఫీ..
చర్మ సంరక్షణకు సంబంధించి కాఫీ పొడిలో ఎన్నో పోషకాలుంటాయి. అందుకే సెలబ్రిటీలు సైతం దీనిని ఫేస్ స్ర్కబ్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కాఫీ పొడి తీసుకుని అందులో రెండు చెంచాల కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 15 నిమిషాల పాటు ముఖంపై మాస్క్‌లా ఉంచుకోవాలి. ఆతర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.