భారత్ బాటలోనే పాకిస్తాన్..!

భారత్ బాటలోనే పాకిస్తాన్..!

0
95

త్రిపుల్ తలాక్ బిల్లు తో భారతదేశంలోని ముస్లిం మహిళలకు ప్రభుత్వం అండగా నిలిచింది. భారత ప్రభుత్వం త్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించినట్టు గానే పాకిస్తాన్ లో కూడా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. తలాక్ అని మూడు సార్లు చెప్పి భార్య నుంచి వెంటనే భర్త విడాకులు పొందడాన్ని చట్టరీత్యా నేరంగా పరిగణించాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.

పాక్ ప్రభుత్వానికి న్యాయపరమైన సలహాలు అందించే ( సి ఐ ఐ ) పాకిస్తాన్ కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ త్రిపుల్ తలాక్ ఆచారాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించినట్టు తెలిసింది.