రెబల్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ నటుడు, నిర్మాత కృష్ణంరాజు ఇటీవల ఇంట్లో కాలుజారి పడ్డారు. దీంతో కృష్ణంరాజుకు చిన్న సర్జరీ అవసరం అయింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ మేరకు ఆయనకు ఆపరేషన్ జరిగింది. నిన్న ఆయన డిశ్చార్జ్ అయినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం కృష్ణంరాజు క్షేమంగా ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.