Breaking: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ సంచలన ప్రకటన

0
65

రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందన్నారు కేసీఆర్. అలాగే ఉద్యోగాల నియామకాలపై మాట్లాడుతూ..1.33 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. 1.56 లక్షల ఉద్యోగాలు నోటిఫై చేశాం.  95 శాతం లోకల్ కోటా..కేవలం 5 శాతమే ఓపెన్ కోటాలోనే ఉద్యోగాలను భర్తీ చేశాం. మరో 22వేల ఉద్యోగాలు నియామాక ప్రక్రియలో ఉన్నాయి. తాజాగా ఉద్యోగాల ఖాళీలపై కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. 91,142 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. వాటిని ఈరోజు నుండే నోటిఫికేషన్ ఇస్తారని కేసీఆర్ ప్రకటించారు.