నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. మరో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను భర్తీ చేస్తున్నామన్నారు. అలాగే వయోపరిమితి విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉద్యోగాల భర్తీలో జనరల్ అభ్యర్థుల వయో పరిమితి 44 ఏళ్లకు, SC/ST/BC అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు వయో పరిమితిగా నిర్ణయించారు. పోలీస్ శాఖ వంటి యూనిఫామ్ సర్వీస్ మినహా అన్నింటిలో వయో పరిమితి వర్తించనుంది.
ఫ్లాష్- ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంపు
Raising the maximum age limit for job candidates