ఒకే కుటుంబంలో ముగ్గురికి డాక్టర్ సీటు..సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ

0
91

మన కుటుంబంలో గాని, చుట్టాలు గాని, తెలిసిన వారు ఎవరైనా మెడికల్ కాలేజీలో సీటు సాధిస్తే గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది ఓ కుటుంబంలో ముగ్గురు డాక్టర్స్ అవ్వడం అంటే అంత ఆషామాషీ కాదు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన రామావత్ కృష్ణ టీచర్ గా పని చేస్తున్నాడు. అతనికి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు. ఆ ముగ్గురికి కూడా డాక్టర్ సీటు రావడం విశేషం. రామావత్ కృష్ణ కొడుకు ఆదిత్య గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుచున్నాడు.

పెద్ద కూతురు అశ్రిత విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ థర్డ్ ఇయర్ చదువుతుంది. చిన్న కూతురు ఆర్ అక్షితకి 2021-22 సంవత్సరం మల్లారెడ్డి మెడికల్ కళాశాలో (HYD) ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ముగ్గురు పిల్లలకి డాక్టర్ సీటు రావడం పట్ల వారిని ఉద్దేశిస్తూ పలువురు సోషల్ మీడియాలో ఇలా అభినందిస్తున్నారు. ఎంబిబిఎస్ సీట్ సాధించిన ముగ్గురికి ప్రత్యేక అభినందనలు. ముగ్గురు పిల్లలు MBBS & MD పూర్తి చేసుకుని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించి, మన్ననలు పొందుతారని ఒకవైపు అభినందిస్తూనే మురోవైపు ఇలా ఆకాంక్షిస్తున్నారు.