ఈ వారంలో విడుదల కానున్న నాని గ్యాంగ్ లీడర్ మూవీ ని ప్రమోట్ చేస్తూ అనేక పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు నాని. అంతేకాకుండా నిన్న బిగ్ బాస్ కి వెళ్లి సందడి చేశాడు. అలాగే ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని బుల్లితెర కార్యక్రమాల్లో హోస్టింగ్ విషయమై తన మనసులో మాట బయట పెట్టాడు. తనకంటూ అవకాశం వస్తే బుల్లితెరపై సత్యమేవ జయతే తరహాలో ఓ కార్యక్రమం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ను టైమ్స్ పత్రిక గుర్తించడానికి అతడు హిందీ లో నిర్వహించిన సత్యమేవ జయతే షో ఓ కారణం. అట్టడుగు వర్గాల వారి సమస్యలు అందరికీ తెలియజేయడానికి తన స్టార్ స్టేటస్ పక్కనపెట్టి అమీర్ ఖాన్ చేసిన ఈ షో అతడికి ఎంతగానో పేరు సంపాదించిపెట్టింది. ఇలాంటి సోను పవన్ కళ్యాణ్ తో చేయాలని ఓ ప్రముఖ ఛానల్ గట్టి ప్రయత్నాలు చేసింది.
పవన్ కు భారీగా ఆఫర్ కూడా చేసింది. అయితే దీనిపై పవన్ పెద్దగా ఆసక్తి చూపలేదు.
అలాంటి సామాజిక స్పృహ ఉన్న షో పై ఆసక్తి ఉన్న నాని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపని షోను నాని చేసి మరో రికార్డు సృష్టిస్తా డో చూడాలి మరి.