కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లుయెన్ నుంచి టెంకే పట్టణం వైపు ప్రయాణిస్తున్న రైలు.. బయోఫ్వే గ్రామం సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడు రైలు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. దీనితో 60 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.