తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో డ్రగ్స్ కు బానిసైన యువత తల్లి, చెల్లి అనే భేధం లేకుండా మానభంగాలు పాల్పడుతున్నారని అన్నారు. మద్యం సేవించి ఆడపిల్లలపై హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మనకు ఇలాంటి సీఎం కావాలా, డ్రగ్ కల్చర్ వచ్చంది తెలంగాణ ప్రభుత్వం వల్ల అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.