గుడ్లు అంటే చాలా మంది ఇష్టపడతారు. ప్రతిరోజు అల్పాహారంలో ప్రజలు గుడ్డు కామన్ గా తీసుకుంటారు. మనం ఆరోగ్యం బాగాలేకపోయిన డాక్టర్స్ గుడ్లు తీసుకోమని సూచిస్తారు. కోడిగుడ్డు రోజూ తీసుకోవడం వలన ఆరోగ్యంగానే కాకుండా, శరీరం సమర్దవంతముగా ఉంటామనే విషయం మనందరికీ తెలిసిందే.
గుడ్డు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో పోషకాహార నిపుణులు చెబుతున్నప్పటికీ, మీరు దానిని ఏ పద్ధతిలో తింటున్నారో కూడా ముఖ్యమని చెప్పారు. కొంత మంది తప్పుగా తింటారు. దానివల్ల మనకు ఎన్నో నష్టాలు చేకూరే అవకాశం ఉంటుంది. కోడిగుడ్డు రుచికరంగా ఉండడమే కాకుండా, అత్యధిక మోతాదులో బి-విటమిన్, పోషకాలు, ప్రొటీన్ నిక్షేపాలతో నిండి ఉంటుంది. గుడ్లను రకరకాలుగా వండుతారు. కొందరు ఉడకబెట్టిన గుడ్లను తినడానికి ఇష్టపడతారు. మరికొంత మంది ఎగ్ పుడ్డింగ్ చేసి తింటారు. కొంతమంది బ్రెడ్‌తో ఆమ్లెట్ తినడానికి ఇష్టపడతారు.
గుడ్డును షుగర్ సంబంధిత వస్తువులు కలిపి తీసుకోకూడదు. షుగర్ వస్తువులు, గుడ్లు కలిపి తీసుకుంటే వీటి నుంచి వచ్చే అమైనో ఆమ్లాల వల్ల రక్తంలో గడ్డలు ఏర్పడతాయి. గుడ్డు, బేకన్ లను కలిపి తీసుకోకూడదు. గుడ్డు, బేకన్ లలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. ఇవి రెండూ కలిపి తీసుకుంటే త్వరగా అలసిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం తప్పు ఆహారం వల్ల ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది.
గుడ్డులోని చాలా పోషకాలు దాని పచ్చసొనలో అంటే పసుపు భాగంలో ఉంటాయి. గుడ్డు మొత్తం అంటే దానిలోని తెల్లటి పొర, పసుపు భాగాన్ని కలిపి తినడం ద్వారా శరీరానికి సరైన ప్రొటీన్, స్ప్రెడ్, క్యాలరీలు అందుతాయి. ఈ కాంబినేషన్‌లో గుడ్లు తినడం వల్ల చాలా మందికి కడుపు నిండుగా ఉంటుంది. గుడ్లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. మరే ఇతర ఆహారంలో లేని అన్ని రకాల పోషకాలు గుడ్డులో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఒక గుడ్డులో విటమిన్ ఎ – 6 శాతం, విటమిన్ బి5 – 7 శాతం, విటమిన్ బి12 – 9 శాతం, ఫాస్పరస్ – 9 శాతం, విటమిన్ బి2 – 15 శాతం , సెలీనియం 22 శాతం ఉంటాయి. అందువల్ల, గుడ్డు తినే సమయంలో దాని పసుపు భాగం కూడా తినాలని నిపుణులు చెబుతారు. గుడ్డు పచ్చసొనలో ఐరన్, రైబోఫ్లావిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఏ డైట్ తీసుకోవాలనుకున్నా.. మీరు ఖచ్చితంగా ఒకసారి డైటీషియన్ సలహా తీసుకోవాలి. అలాగే క్యాలరీల విషయంలోనూ చాలా మంది పచ్చసొనను తినడానికి ఇష్టపడరు. గుడ్డులో దాదాపు 72 క్యాలరీలు ఉంటాయి. ఇందులో 55 క్యాలరీలు పచ్చసొనవి కాగా.. తెలుపు భాగంలో 17 క్యాలరీలు ఉంటాయి.