తెలంగాణలో టెట్ నిర్వహణపై సర్కార్ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. టెట్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి తెలిపారు. అలాగే ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రతి యూనివర్సిటీ పరిధిలో ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.