వైద్య రంగంలో మరో మైలురాయి..ఒకేసారి రెండు మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్స సక్సెస్

0
74

వైద్య రంగంలో మరో మైలురాయి నమోదయింది. అందుకు కొత్తగూడెంలోని వరుణ్ ఆర్థోపెడిక్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వేదికగా మారింది. డాక్టర్ వరుణ్ కుమార్ నేతృత్వంలో ఒకే సారి రెండు మోకాళ్లు మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం అయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే డి. ప్రమీల రాణి (50 సం) తీవ్ర మోకాళ్ల నొప్పులతో, నడవలేని స్థితిలో ఉంది. దీనితో ఆమె వరుణ్ ఆర్థోపెడిక్ & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను సంప్రదించారు. పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు రెండు మోకాళ్ళ శస్త్ర చికిత్సకు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆమె మోకాళ్ల నొప్పులు భరించలేక శస్త్ర చికిత్సకు ఒప్పుకుంది. ఈ క్రమంలో ఆమెకు కేవలం 4 గంటల్లో రెండు మోకాళ్లు మార్పిడి శస్త్ర చికిత్స చేసి కొత్తగూడెం వైద్య చరిత్రలో చెరగని మైలురాయిని సొంతం చేసుకున్నారు వైద్యులు డా. వరుణ్ కుమార్.

కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్
డా.జి.వరుణ్ కుమార్ గతంలో కూడా ఇటువంటి అరుదైన కార్పొరేట్ స్థాయి సర్జరీలను గూడెం వాసులకు అందించారు. అలాగే ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో ఈ చికిత్సలు  చేయడం విశేషం. ఈ అరుదైన శస్త్ర చికిత్సకు మత్తు వైద్య నిపుణులు సహకరించారు.డా.బి. రాము, ఇతర సపోర్టివ్ సిబ్బందికి మేనేజ్ మెంట్ తరపున జి. వసంత్ కుమార్ శుభాకాంక్షలు తెలిపి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన కార్పొరేట్ వైద్యం తమ ప్రత్యేకతగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.