మేము అనగా 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్స్ తమరికి నమస్కరించి ఎంతో ఆశతో వ్రాయునది ఏమనగా!
మేము 2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ రేంజ్ కింద 432 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ గా సెలెక్ట్ అయ్యి నేటికీ 11 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నాము. ఇప్పటివరకు మా 2009 సబ్ ఇన్స్పెక్టర్స్ బ్యాచ్ యందు 211 మంది పదోన్నతులు పొందారు. ఇంకనూ 200 మంది పదోన్నతులు పొందాల్సి ఉన్నది.
మా బ్యాచ్ నందు ప్రమోషన్ పొందిన వారు మూడు సంవత్సరాలు తమ సర్వీస్ పూర్తి చేసినారు. అదే సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా బ్యాచ్ వారు మొత్తం సబ్ ఇన్స్పెక్టర్స్ లు అందరూ పదోన్నతులు పొంది 4 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసినారు. వరంగల్ రేంజ్ నందు పని చేస్తున్న, మాకంటే జూనియర్ బ్యాచ్ అయినా 2012 సబ్ ఇన్స్పెక్టర్స్ బ్యాచ్ వాళ్లు, ఈ ప్యానల్ సంవత్సరం 2020-2021 లో 40 పదోన్నతులు పొందినారు. మేము సీనియర్ బ్యాచ్ అయినా కూడా వారి కింద జూనియర్లుగా గుర్తించబడతాము.
అంతే కాకుండా రాబోయే కాలంలో పొందే పదోన్నతులలో కూడా వారే ముందుగా పదోన్నతులు పొంది అవకాశం ఉన్నది. మా సీనియారిటీని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇట్టి వివాదం మా 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్స్ హైదరాబాద్ రేంజ్ మరియు 2012 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్స్ వరంగల్ రేంజ్ మధ్య వివాదం తలెత్తే అవకాశం ఉన్నది. ఇప్పటికీ మా 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్స్ లలో కొంతమంది పదోన్నతులు పొందిన వారికి మరియు పొందని వారికి మధ్య మూడు సంవత్సరాల వ్యత్యాసం ఏర్పడినది. ఈ మధ్య కాలం లో ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 59సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకొని జీవో నెంబర్.45 జారీ చేసినది.
కావున రాబోయే మూడు సంవత్సరాల వరకు పదవీ విరమణలు ఉండవు. కావున ఈ ప్యానల్ ఇయర్లో మాకు పదోన్నతులు రాకపోతే రాబోయే మూడు సంవత్సరాల వరకు మాకు పదోన్నతులు ఉండవు. ఇప్పటికే మా బ్యాచ్ లో కొంత మంది ఇన్స్పెక్టర్స్ గా పదోన్నతులు పొంది మూడు సంవత్సరాలు దాటిపోయింది. మా మొత్తం బ్యాచ్ పదోన్నతి పొందేందుకు ఇంకా ఐదు నుండి ఏడు సంవత్సరాల సమయం పడుతుంది.
ఇట్టి విషయంలో వెంటనే రాష్ట్ర పోలీసు శాఖ ఉన్నతాధికారులతో చర్చించి మా 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కు,
1. సూపర్ న్యూమరీ ద్వారా ఏర్పడిన ఖాళీలను 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టరస్ కు పదోన్నతులు కల్పించి వారి స్థానాలను భర్తీ చేయడం.
2. సప్రస్ పోస్టులు విడుదల చేసి 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ పదోన్నతులు కల్పించాలి.
3. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ ల లో అన్ని పోలీసుస్టేషన్ లను అప్ గ్రేడ్ చేయాలి. దాని ద్వారా కొన్ని ఇన్స్పెక్టర్ పోస్టులు ఏర్పడే అవకాశం ఉంది. ఇట్టి ఏర్పడ్డ ఇన్స్పెక్టర్స్ 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ లకు, ఇన్స్పెక్టర్స్ గా హోదా కల్పించి వారి ఖాళీలు భర్తీ చేయాలి.
4. తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రాధాన్యత గల పోలీసు స్టేషన్లను SHO లుగా సబ్ ఇన్స్పెక్టర్స్ నుండి ఇన్స్పెక్టర్ గా మార్చడం ద్వారా ఇన్స్పెక్టర్స్ వేకెన్సీ ఏర్పడుతుంది. ఇట్టి వేకెన్సీ లను 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్స్ లకు ఇన్స్పెక్టర్గా పదోన్నతి కల్పించాలి . తద్వారా నేర నియంత్రణ, పరిపాలన సౌలభ్యం జరుగుతుంది. అంతే కాకుండా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం కలుగుతుంది.
5. మెట్రో రైల్ లోని 144 పోస్టులను 2009 సబ్ ఇన్స్పెక్టర్ స్ లకు పదోన్నతి ఇచ్చి వారి ద్వారా భర్తీ చేసి నేరాలు నియంత్రించి సురక్షిత హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దాలి.
6. లూప్ లైన్ లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.
ఈ ప్యానల్ ఇయర్ లో మాకు పదోన్నతులు రాకపోతే రాబోయే మూడు సంవత్సరాలకు మాకు ఒక్క పదోన్నతి వచ్చే అవకాశం లేదు.
తమరు మా యొక్క విన్నపాన్ని మన్నించి మా 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ గా మిగిలిన 200 మందికి ఇన్స్పెక్టర్స్ గా పదోన్నతి కల్పిస్తారని కోటి ఆశలతో మా విన్నపాలను తెలియజేస్తున్నాము.
జై తెలంగాణ.
ఇట్లు.
తమ ఆశీస్సులు కోరే 2009 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ స్.