హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తీర్పుతో గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టింది. హిజాబ్‌పై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ కొట్టివేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాం మతానికి సంబంధించి తప్పనిసరి ఆచారం కాదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని సంచలన తీర్పు వెలువరించింది.