పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వారికి అలర్ట్..మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ స్కీమ్ లు కడుతున్న వారికి కొత్త రూల్స్ రానున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనుంది. మరి ఇక దీని గురించి పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ సర్క్యులర్ ప్రకారం ఖాతాదారులు తమ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్‌ను మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ స్కీమ్‌లకు 2022 మార్చి 31 లోగా లింక్ చేయాలి. లేకపోతే ఆ వడ్డీ సంబంధిత MIS/SCSS/TD అకౌంట్లలో జమ అవుతుంది. రావాల్సిన వడ్డీని సేవింగ్స్ అకౌంట్‌లోకి జమ చేయించుకోవచ్చు. లేదా చెక్ ద్వారా తీసుకోవచ్చు.
2022 ఏప్రిల్ 1 తర్వాత నగదు రూపంలో వడ్డీ మాత్రం రాదు. ఈ పద్ధతి ద్వారా ఖాతాదారులు పోస్ట్ ఆఫీసుకి రావాల్సిన అవసరం లేకుండానే వడ్డీ పొందొచ్చు. వడ్డీ తీసుకోవడానికి వేర్వేరు ఫామ్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతీ నెల, మూడు నెలలకు, ఏడాదికి ఓసారి వడ్డీ నేరుగా అకౌంట్‌లో జమ అవుతుంది.