ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..తెలంగాణలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ వల్ల ఏప్రిల్ 22 నుండి జరగాల్సిన పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ఈ మేరకు మే 6 నుంచే మే 23 వరకు ఫస్ట్ ఇయర్, మే 7 నుంచి 24 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.