దిశ ఎన్ కౌంటర్ రిపీట్..అత్యాచార నిందితుడిపై పోలీసుల కాల్పులు..ఎక్కడో తెలుసా?

0
99

రోజురోజుకు దేశంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన, కోర్టులు ఎంతటి శిక్ష వేసిన అఘాయిత్యాలను ఆపలేకపోతున్నాయి. కాగా ఇప్పటికే తెలంగాణాలో అత్యాచారం నిందితునిపై దిశ ఎన్ కౌంటర్ ఎంతలా పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా దేశంలో మరోసారి దిశ ఎన్ కౌంటర్ రిపీట్ అయింది. అసోంలో ఓ యువతిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు మంగళవారం రాత్రి ఎన్ కౌంటర్ చేశారు.

ఈ ఘటనపై పూర్తి వివరాల్లోకి వెళితే..బికి అలీ అనే వ్యక్తి తన నలుగురు స్నేహితులతో కలిసి గరియాన్లోని ఓ హోటల్లో ఓ మైనర్ పై లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. అత్యాచారం తర్వాత వారంతా పారిపోయారని తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్టు పాన్బజార్ మహిళా పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత ప్రధాన నిందితుడు బికి గురించి సమాచారం తెలియడంతో అతడిని మంగళవారమే అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. మిగిలిన నలుగురు నిందితుల కోసం గాలింపు చర్చలు కొనసాగుతున్నట్టు తెలిపారు.

ఈ క్రమంలో సామూహిక లైంగిక దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒక్కడైన బికి అలీ తమ కస్టడీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడని తెలిపారు. ఈ క్రమంలో స్టేషన్లో పోలీసులు అతడికి ఆపే ప్రయత్నం చేయడంలో అలీ తమపై దాడి చేసినట్టు గువాహటి పోలీసులు వెల్లడించారు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ అలీ వినకపోవడంతో ఆత్మరక్షణ కోసం అతడిపై కాల్పులు జరిపినట్టు పేర్కొన్నారు. నిందితుడి దాడిలో ఇద్దరు మహిళా పోలీసులు గాయపడినట్టు పోలీసు అధికారులు తెలిపారని ఏఎస్ఐ వార్త సంస్థ ట్విటర్లో పేర్కొంది.