‘కేసీఆర్ అలా అనడం దారుణం..జిఓ 111 పై బహిరంగ చర్చ పెట్టాలని డిమాండ్’

0
99

భవిష్యత్ కోసం మౌలిక సదుపాయాలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓ ప్లాన్ అంటూ లేదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి విమర్శించారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..టిఆర్ఎస్ సర్కార్ పై, కేసీఆర్ నిర్ణయాలపై ఫైర్ అయ్యారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసింది. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్ ను ఆలోంచించుకొని మాస్టర్ ప్లాన్ చెయ్యాలి. కానీ ఈ ప్రభుత్వానికి ఓ ప్లాన్ అంటూ ఏమి లేదని ఎద్దేవా చేశారు.

నిన్న కేసీఆర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 111 జిఓ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడే అంశాన్ని ముందుగా బులెటిన్ రూపంలో తెలపాలి. కానీ కేసీఆర్ అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్షాలను అవమాన పరిచే విధంగా చేశారు. ఒక ముఖ్యమైన జిఓ రద్దు చేస్తామని ప్రకటించే ముందు ఎలాంటి చర్చ లేదు. నేషనల్ సెన్సింగ్ అథారిటీ హైదరాబాద్ లో ఏ భూమి ఎలా వాడుకోవాలో తెలిపారు. గండిపేట నీరు చాలా మంచివి అలాంటి చెరువులను పొడిచేస్తామని అనడం చాలా దారుణం. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ఈ సమాచారం లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. జిఓ 111ను రివ్యూ చేయాలి. బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పర్యావరణ వేత్తలతో, రైతులతో బహిరంగ చర్చ పెట్టాలి. 1.36 లక్షల ఎకరాల భూమి ఉందని అంటున్నారు. భూముల లెక్కలు తేల్చాలి. రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. ఇందులో ఒక రహస్య ఎజెండా ఉన్నదని అనుమానం ఉంది. రైతులు తరతరాలుగా వారసత్వంగా వ్యవసాయం చేసి చెరువుల పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోదండరెడ్డి డిమాండ్ చేశారు.