ఫ్లాష్- చిన జీయ‌ర్ స్వామికి షాక్..అట్రాసిటి కేసు!

0
76

స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల‌పై ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు చిన జీయ‌ర్ స్వామి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చిన జీయ‌ర్ వ్యాఖ్య‌ల‌పై భ‌క్తులు, రాజ‌కీయ నాయ‌కులు మరోవైపు ఆదివాసీ సంఘాల నాయ‌కులు బ‌హిరంగ క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఆదివాసీ సంక్షేమ సంఘం ఏకంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆదివాసీ దేవ‌త‌లు అయిన స‌మ్మక్క – సార‌ల‌మ్మ ల‌పై అనుచిత వ్యాఖ్య‌లే చేసిన చిన జీయ‌ర్ స్వామిపై అట్రాసిటి కేసు న‌మోదు చేయాల‌ని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిన జీయ‌ర్ స్వామిపై వెంట‌నే అట్రాసిటి కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌ను కోరారు.