రేపే దత్తాత్రేయ ప్రమాణస్వీకారం

రేపే దత్తాత్రేయ ప్రమాణస్వీకారం

0
109

బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులైన సంగతి తెలిసిందే.. హైదరాబాద్లోని ఆయన నివాసంలో దత్తాత్రేయ కు అధికారులు నియామక పత్రాలను అందజేశారు. బుధవారం ఉదయం 10 30 గంటలకు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిమాచల్ ప్రజల అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని చెప్పారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన సందర్భంగా తనను పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నేతలు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.