శుభ‌వార్త‌..భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధరలు

0
99

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో కొండెక్కిన బంగారం ధరలు ప్రస్తుతం శాంతించాయి. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొత్త ఏడాదిలో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధర ఇప్పుడు హఠాత్తుగా పడిపోయి పసిడి ప్రియులకు శుభవార్త చెప్పింది. అలాగే వెండి ధరలు కూడా తగ్గాయి.

అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ముందు బంగారం,వెండి ధరలు తగ్గడంతో ప్రజల ఆనందం వ్యక్తం చేస్తన్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు… ఏదైనా ఉందంటే అది కేవలం బంగారం మాత్రమే. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువ. చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు

నేటి బంగారం ధరల వివరాలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గి రూ. 51,600 గా నమోదు  అయింది. అదేవిధంగా  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 47,300 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గిపోయాయి. కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ.72,300 గా నమోదు అయింది.