పుష్ప- 2 లో కొత్త పాత్రలు..సీనియ‌ర్ హీరోయిన్ కు కీలక పాత్ర

0
94

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన తాజా సినిమా పుష్ప‌. ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెరకెక్కించారు.ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా న‌టించింది. అయితే.. ఈ సినిమా గతేడాది డిసెంబ‌ర్ 17వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల అయింది.

ఈ సినిమా పై పాజిటివ్ టాక్ రావ‌డంతో… జ‌నాలు ఎగ‌బ‌డి చూసారు. పుష్ప సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. సౌత్ లో కంటే నార్త్ లో పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు పుష్ప 2 కోసం అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.  అయితే పుష్ప 2 సినిమా త్వరలోనే రానుందని చిత్ర బృందం వెల్లడించింది. పార్ట్‌ 2 షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే.. పార్ట్‌ 2 లో కొత్త పాత్రలు వస్తాయని సమాచారం అందుతోంది. అయితే ఒక‌ప్ప‌టి సీనియర్ గ్లామ‌ర్ హీరోయిన్ ఇంద్ర‌జ‌..ప్రస్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు పాత్ర‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సారి టాలీవుడ్‌ పరిశ్రమకు చెందిన సీనియర్‌ హీరోయిన్‌ ఇంద్రజను పార్ట్‌ 2 లో దింపేందుకు దర్శకుడు సుకుమార్‌ సిద్ధం అయ్యారట. ఈ మేరకు ఆమె కూడా ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. పుష్ప 2 కోసం ఎంచుకున్న తొలి న‌టి ఈమెనే. చివ‌రి నిమిషంలో స్క్రిప్టులో చేసుకున్న మార్పుల వ‌ల్ల ఒక‌ట్రెండు కొత్త పాత్ర‌లకు అవ‌కాశం దొరికింద‌ని, అందుకే ఇంద్ర‌ని ఖ‌రారు చేశార‌ని టాక్‌. ఈ పాత్ర‌… పుష్ప‌రాజ్ ఛైల్డ్ ఎపిసోడ్‌తో లింక్ అవుతుంద‌ని తెలుస్తోంది. పుష్పలో ఛైల్డ్ ఎపిసోడ్ కొంచెమే చూపించారు. పుష్ప 2లో ఆ ఎపిసోడ్ కీల‌కం కానుంద‌ని తెలుస్తోంది.