తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం.. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
మల్లు స్వరాజ్యం పార్థివదేహం నల్గొండకు చేరుకుంది. మర్రిగూడ బైపాస్ రోడ్డు నుంచి ర్యాలీగా వచ్చి సీపీఎం కార్యాలయానికి చేరుకున్న భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆమెకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బీజేపీ నేత పాల్వాయి రజనీ కుమారీ, కమ్యూనిస్టు నేతలు మధు, బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు నివాళులర్పించారు.
మర్రిగూడ బైపాస్ రోడ్డు నుంచి ర్యాలీగా వచ్చి సీపీఎం కార్యాలయానికి చేరుకుంది. ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం నల్గొండ సీపీఎం కార్యాలయం నుంచి అంతిమయాత్ర సాగనుంది. మల్లు స్వరాజ్యం కోరిక మేరకు నల్గొండ మెడికల్ కళాశాలకు ఆమె పార్థివదేహాన్ని కుటుంబీకులు అప్పగించనున్నారు.