ఇవాళ జరిగిన టిఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లో హిందూ పండిట్ లను చంపినప్పుడు బిజెపి ప్రభుత్వం అధికారంలో లేదా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలు పక్కదోవ పట్టడానికే కాశ్మీర్ ఫైల్ సినిమా తెరపైకి తెచ్చారని నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. దేశంలో సమస్యలు పక్కదారి పట్టించడానికే ఈ సినిమా రిలీజ్ చేసారన్నారు.